|

పత్తిపాకకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి డా. పత్తిపాక మోహన్‌ ఎంపికయ్యారు. గాంధీజీపై ఆయన రాసిన ‘బాలల తాతా బాపూజీ’ గేయ కథకుగాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అభినందనలను తెలియజేశారు. తనకుతాను కీ.శే. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి శిష్యుడనని చెప్పుకుంటే సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన పత్తిపాక మోహన్ సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ పురస్కారం దక్కడం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు.