చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతున్న పేట పార్కులు

పిల్లలు చిన్నతనంలో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటేనే ఎదిగే కొద్ది వినూత్న ఆలోచన, విజ్ఞానం పెరగటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు అనేది అక్షర సత్యం. కాని మారుతున్న కాలక్రమం, పిల్లల కాన్వెంట్‌ స్కూల్స్‌తో పాటు పాశాలల్లో సరైన ఆట స్థలం దొరక్క ఆడుకునే వయసుల్లో సైతం పిల్లలు యాంత్రిక జీవనం గడపాల్సి వస్తోంది. పిల్లలతో పాటు పెద్దలు సైతం ఉదయాన్నే కాలి నడక, వ్యాయామం వంటివి చెయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం పరిరక్షించుకోవడం తో పాటు ఆయువు పెరుగుతుంది. హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో కొన్ని పార్కులు ఉంటాయి.

నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన దాహరి కృషి, స్థానిక శాసన సభ్యులు ఎస్‌. రాజేందర్‌ రెడ్డి సహకారంతో మహానగారాల్లోని పార్కులకు ఏమాత్రమ తీసిపోని విధంగా సైన్స్‌ పార్కు, చిన్న పిల్లల పార్కు నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, ఐ.టి. శాఖ మంత్రి కే. తారక రామరావు జులై, 10, 2021న తన చేతుల మీదుగా నారాయణ పట్టణంలో సకల సౌకర్యాలతో చిన్న పిల్లల పార్కుతో పాటు సైన్స్‌ పార్కును ప్రారంభించి పట్టణ ప్రజలకు అంకితం చేసారు. పట్టణ ప్రగతి లో భాగంగా 80 లక్షల రూపాయల వ్యయంతో చిన్న పిల్లల పార్కు, 1.45 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్‌ పార్క్‌ ను ప్రారంభోత్సవం చేసారు.

అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన సైన్సు పార్కులో పిల్లలకు చదరంగం, పాము నిచ్చేన ఆట, డైనోసార్స్‌ ప్రతిమ, ప్రహరి గోడల పై అందమైన చిత్రాలు, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్కలతో పాటు పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన రొటేటింగ్‌ స్కల్చర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉదయం, సాయంకాలం కాలి నడక చేస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు నారాయణపేట పట్టణ ప్రజలు. పిల్లల ఆట స్థలంలో ప్రతి రోజు పిల్లలు కేరింతలు కొడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఈ పార్కులలో చిన్న పెద్ద, ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆహ్లాదం పొందుతూ సేద తీరుతున్నారు. కొందరు తమ స్థాయిని బట్టి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌, యువకులు తమకు నచ్చిన విధంగా ఫోటోలు దిగుతూ సంబరపడిపోతున్నారు.

పార్కు ఆవశ్యకత, ప్రత్యేకతలు సందర్శకుల మాటల్లో…
నేను పుట్టి పెరిగింది జిల్లా కేంద్రంలోనే, మేము చిన్న వయస్సులో ఉన్నపుడు మాకు ఆడుకోవడానికి ఎలాంటి పార్క్‌ లు అందుబాటులో ఉండేవి కాదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సి పాలిటిలలో పార్కుల ఏర్పాటు, పరిశుభ్రత, స్వచ్చ భారత్‌కు పెద్ద పీట వేయడం, అదే విధంగా జిల్లా కలెక్టర్‌ చోరువతో పట్టణంలో పార్కులు ఏర్పాటు చేసుకోవడం చాల ఆనంద కరంగా ఉంది. చిన్న పిల్లలకు మంచి వాతావరణాన్ని కల్పించినదుకు జిల్లా కలెక్టర్‌ గారికి స్థానిక శాసన సభ్యులకు ధన్యవాదాలు.

విద్యాసాగర్‌ డిప్యూటి మేనేజెర్‌, ఎస్‌.బి.ఐ.
మేము జిల్లా కేంద్రంలో ఉన్న స్వామి వివేకానంద పార్క్‌ కు వెళ్ళే వాళ్ళం. అది చాల చిన్నగా ఉండటం వల్ల నడవ డనికి ఇబ్బందికరంగా ఉండేది. కాని ఇక్కడ పార్క్‌ ఏర్పాటు చేయడం వలన ఇప్పుడు హాయిగా వాకింగ్‌ చేస్తున్నాం, యోగ లాంటి వ్యాయామం చేసుకుం టున్నాం. రోజు రెండు సార్లు ఇక్కడకు వాకింగ్‌కు వస్తాము. పార్క్‌ లో ఓపెన్‌ జిమ్‌ పరికరాలు కూడా ఉన్నాయి. ఉదయం చాల మంది వృద్ధులు, యువకులు వచ్చి వాకింగ్‌, యోగ చేస్తారు.

కృష్ణ రెడ్డి, స్థానికుడు
గత రెండు సవత్సరాలుగా నేను ఇక్కడే బ్యాంక్‌లో పనిచేస్తు నాను. నేను ఇక్కడకి వచ్చినప్పుడు చిన్న పిల్లలకు ఆడుకోవడానికి ఎలాంటి పార్క్‌ లేక పోవడంతో తమ పిల్లలను ఆడు కోడానికి ఎక్కడికి తిసుకు వేళ్ళాలో అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం సైన్స్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేయడం చాల అభినందనీయం. సైన్స్‌ పార్క్‌లో గోడల పై సైన్స్‌కు సంబందించిన ఫోటోలు ఉండడం వల్ల పిల్లలకు చిన్న తనం నుంచే సైన్స్‌ గురించి తెలుస్తుంది. పిల్లలు ఇక్కడకు వచ్చి చూసాక వారిలో సైన్స్‌ పై ఆలోచన

కలుగుతుంది. స్వచ్చత పరంగా కూడా బాగానే ఉంది.: సమత, టీచర్‌
నారాయణపేట జిల్లా ఏర్పడ్డాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి వినూత్న కార్య క్రమాల ద్వారా పట్టణాలను, అటు పల్లెటూర్లలో సైతం పార్కులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం తో పాటు పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.