ప్రగతి మాసం..

By: రమేశ్‌ హజారీ

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని నిరంతరం పరుగులు పెట్టిస్తూ రాత్రనకా పగలనకా కష్టపడుతూ, దార్శనికతతో ఏడేండ్లలోనే ఏడు దశాబ్దాల కష్టాలను మరిపించిన మహానేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. ఈ నేపథ్యంలో సీఎం కేసీిఆర్‌ నెల నెలా నిర్వహించిన ప్రగతి సమాచారాన్ని ఈ నెల నుంచి ‘‘ప్రగతి మాసం’’ పేరుతో నెల నెలా తెలంగాణ మాస పత్రికకు ప్రత్యేకం…

22 జూన్‌  2021 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామ సందర్శన : పల్లెలు ప్రగతి పథంలో నడవాలె అనే పట్టుదలతో తాను దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కన్నతల్లి లాంటి ఉన్నవూరును ప్రగతి పథంలో నడిపించుకోవడంలో అండగావుంటానని సిఎం ధైర్యమిచ్చారు. గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికోసం కార్యాచరణ ప్రకటించారు.

25 : ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో మరణిం చడంపై సీఎం కేసీఆర్‌ను కలిసిన సీఎల్పీ నేత భట్టి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు.

మెట్రోకు సహకారం అందిస్తాం : కరోనా నేపథ్యంలో మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని తమను ఆదుకోవాలని కోరుతూ తనను కలిసిన మెట్రో ఉన్నతాధి కారులకు సీఎం కేసీిఆర్‌ భరోసా ఇచ్చారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఎల్‌ అండ్‌ టి సంస్థ అధికారులకు తెలిపారు. 

26 : రాష్ట్రంలో జూలై 1 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ముందు ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశం సందర్భంగా పాల్గొన్న కలెక్టర్లు ఉన్నతాధి కారులకు పలు సూచనలు చేశారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తూ పచ్చబడేలా ఎట్లా చేయవచ్చునో ఈ సందర్భంగా వివరించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌ టీయూ – టీఎస్‌ నాయకులు ప్రగతి భవన్‌లో సీఎంను కలిసారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తామని స్పష్టం చేశారు.

27 : ఆర్థిక సామాజిక వివక్షనుంచి దళితులను విముక్తం చేయడమే లక్ష్యంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా దళితుల సాధికారతకోసం పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో దళిత బంధు ఎంపవర్‌ మెంట్‌ పథకంపై అఖిల పక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. దళితోద్ధరణకు చేపట్టాల్సిన కార్యాచరణను వారితో చర్చించి నిర్ణయించారు. ఈ నిర్ణ యం దేశ చరిత్రలోనే గొప్పదని కొనియాడిన అఖిల పక్షం నేతలు అందులో తాము రాజకీయాలకతీతంగా పాల్గొం టామని స్పష్టం చేశారు.

28 : తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేంచేందుకు సీఎం కేసీిఆర్‌ ప్రకటించిన ‘దళిత సాధి కారత పథకం’.. దళితుల పాలిట వరమని దళిత మేధా వులు స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో వారు సిఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర తీరాన జ్ఞానభూమిలో పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్డులోని 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, గవర్నర్‌ తమిళిసై ఆవిష్కరించి, నివాళులర్పించారు. ఆ మార్గానికి పీవీ మార్గ్‌గా పేరు పెట్టి, ప్రారంభించారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే.కేశవరావు ఆధ్వర్యంలో ‘నమస్తే పీవీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

3 జూలై 2021 : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌ చట్ట వ్యతిరేకంగా అక్రమ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో  గుర్తించబోదని, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం స్పష్టంగా తీర్మానించింది. 

4 : సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల నియోజక వర్గంలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదాయాన్ని, దేశంలోనే రెండోదైన తెలంగాణలో తొలి అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రాన్ని,  నర్సింగ్‌ కాలేజీని, వ్యవసాయ మార్కెట్‌తో పాటు జిల్లా కలెక్టరు,  సమీకృత జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల సహా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లోని సాగునీటిపారుదలపై సమీక్ష సమావేశం జరిపారు.

6 : కృష్ణాజలాలపై టిఆర్‌ఎస్‌ ఎంపీలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణకు హక్కుగా రావా ల్సిన నీటివాటాను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాపై ట్రిబ్యు నల్స్‌, న్యాయస్థానాలు సహా అన్ని వేదికలమీద తెలంగాణ నీటి హక్కుల కోసం కొట్లాడుతామని సీఎం స్పష్టం చేశారు. నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ఎంపీలను ఆదేశించారు.

9 : రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్‌ విధానానికి ఇటీవలే (28జూన్‌ రాష్ట్రపతి ఉత్తర్వులు) అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి 50వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం సమీక్షించారు. మరోసారి జ్వర సర్వేను నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా విస్తరణకు గల కారణాలను క్రిటికల్‌ అనాలిసిస్‌’ చేయాలన్నారు.

13 : మొదటిరోజు కేబినెట్‌ సమావేశం : ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఏడున్నర గంటలపాటు సుధీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాల పైన మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది. పదిరోజుల పాటు జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సహా హరితహారం కార్యక్రమాలు ఎలా సాగాయనే దానిపై కేబినెట్‌ చర్చించింది.

రెసిడెన్షియల్‌ స్కూళ్లలో స్థానిక విద్యార్ధులకు 50 శాతం సీట్లను కేటాయిం చాలనే స్థానిక రిజర్వేషన్‌ విధానాన్ని ప్రకటించిన కేబినెట్‌, స్థానిక ప్రజాప్రతి నిధులను విద్యాసంస్థల సమావేశాలకు ఆహ్వానించాలని నిర్ణయించింది. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, అధికారుల కేటాయింపులు చేపట్టాలని టీఎన్‌ జీవో, టీజీవో ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై కేబినెట్‌ చర్చించి, తక్షణ చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చతో పాటు పలు అంశాల మీద చర్చించగా ఇంకాకూడా పలు అంశాల మీద చర్చిం చాల్సిన కేబినెట్‌ను సీఎం కేసీిఆర్‌ తెల్లారికి వాయిదావేశారు.

14 :  రెండోరోజు కేబినెట్‌ సమావేశం : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. ముందుగా వ్యవసాయ శాఖపై కేబినెట్‌ చర్చ జరిగింది. ధాన్యం నిల్వ, మిల్లింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త మిల్లుల స్థాపనను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను సీఎం ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను పెద్దస్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేసింది.

రాష్ట్రంలో ఆయిల్‌ ఫామ్‌ సాగును ప్రోత్సహించాలని ఆయిల్‌ ఫామ్‌ సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.36 వేలు పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద మూడేళ్లలో సబ్సిడీగా అందచేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్‌ కార్డులపై ఆగస్టు నుంచే రేషన్‌ బియ్యం అందచేయాలన్నారు.

16 : టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగింది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. పెండిరగులో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని కోరారు.

18  : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. ‘‘తెలంగాణ దళిత బంధు’’ అనే పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ పథకం అమలు కోసం పైలట్‌ ప్రాజెక్టుగా కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజక వర్గాన్ని ఎంపిక చేశారు. ‘‘తెలంగాణ దళిత బంధు’’ పథకం ద్వారా ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు అందిస్తుందని, లబ్ధిదారుల భద్రతకు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధి ఉంటుందన్నారు.

19  : తమ అభివృద్ధిని తామే నిర్వచించు కునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేయబోతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధి విధానాలు, రూపొందిం చాల్సిన ఉపాధి పథకాలపై ప్రగతి భవన్‌లో సమీక్షించారు.

20  : తెలంగాణలో వృత్తి కులాలైన బిసీ వర్గాల అభ్యున్నతి – ప్రభుత్వ కార్యాచరణ – రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌  అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యూనిట్‌ ధరను రూ. 1,75,000కు పెంచాలని యూనిట్‌కు 21 గొర్రెల చొప్పున 3.5 లక్షల యూనిట్లను రూ.6000 కోట్లతో రెండవ విడత గొర్రెల పంపిణీని చేపట్టాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు.

సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమావేశం. సింగరేణి కార్మికుల, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్య మంత్రి నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా 43,899 మందికి లబ్ధి చేకూరనున్నది. రామగుండంలో సింగరేణి మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు.

21 : గొర్రెల యూనిట్‌ ధరను పెంచడమే కాకుండా, రూ. 6 వేల కోట్లతో తమకు రెండవ విడత గొర్రెలను పంపిణీ చేస్తున్నందుకు.. ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష కార్యదర్శి వర్గం, సీఎం కేసీఆర్‌   కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

22 : ఎగువ రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో.. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యుద్ద ప్రాతిపదికన చర్యల కోసం సీఎం కేసీఆర్‌ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.