శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం

తృెంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో  ముందుకు సాగుతృున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగిర పరుస్తోంది.రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి  చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయాలని కోరారు. సీతారామ, శ్రీరామసాగర్‌ పునరుజ్జీవం పథకం పనులు మందకొడిగా నడుస్తృున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, వర్క్‌ ఏజన్సీలతో, సంబంధిత అధికారులతో మాట్లాడి, సత్వరం పనులు పూర్తి చేయాలని కోరారు.
tsmagazine

ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు తానే స్వయంగా నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని ముఖ్యమంత్రి   నిర్ణయించారు.

రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడు గంటల పాటు సమగ్రంగా సమీక్షించారు. మంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సి మురళీధర్‌, ఇతృర అధికారులు ఎంపి బి. వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్  రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం, ఎస్‌ఆర్‌ఎస్పి పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలపై కూలంకషంగా చర్చించారు. అధికారులకు తగు సూచనలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములకు తక్షణం పరిహారం చెల్లించాలని ఆదేశించారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితృులకు చెల్లించడానికి రూ.80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం కోరారు. భూపాలపల్లి, నిర్మల్‌, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పారు.

”ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. పునరుజ్జీవన పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాలువలో నీటి లభ్యత ఎక్కువగాఉంటుంది. ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నుంచి ఆఫ్‌ టేక్‌ (ఓటి) తూముల ద్వారా అన్ని చెరువులకు నీరందించాలి. కాకతీయ కెనాల్‌ – ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ మధ్యనున్న ఆయకట్టుకంతృా నీరందించేలా. ఈ ప్రాంతృంలోని అన్ని చెరువులు నింపాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
tsmagazine

”తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాలి. వచ్చే జూన్‌, జూలై నాటికి నీరందించాలి. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం అనుకున్నంతృ వేగంగా జరగడం లేదు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాల్లో వేగం పెరగాలి” అని ముఖ్యమంత్రి  ఆదేశించారు.కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. సింగూరుకు రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి లక్ష, జహీరాబాద్‌ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందరించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీఎం కోరారు. కౌలాస్‌ నాలాను పటిష్టం చేయడంతో పాటు, నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని చెప్పారు. మహారాష్ట్ర అధికారులతృో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

సీతారామ ఎత్తిపోతల పథకంతృో పాటు, శ్రీరామసాగర్‌ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని సీఎం అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తృం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 11వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని, పనుల్లో ఏమాత్రం జాప్యం, నిర్లక్ష్యం వహించవద్దని సీఎం అన్నారు. వర్క్‌ ఏజన్సీల బాధ్యులతృో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. పునరుజ్జీవ పథకం పనులను మే కల్లా పూర్తృి చేస్తృామని వర్క్‌ ఏజెన్సీలు  సీఎంకు మాటిచ్చాయి.

పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు

”ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. పునరుజ్జీవన పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాలువలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ నుంచి ఆఫ్‌ టేక్‌ (ఓటి) తూముల ద్వారా అన్ని చెరువులకు నీరందించాలి. కాకతృీయ కెనాల్‌ – ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ మధ్యనున్న ఆయకట్టుకంతా నీరందించేలా. ఈ ప్రాంతలోని అన్ని చెరువులు నింపాలి”