సురక్షితంగా గిరిజన సంక్షేమం

By: ధ్యావనపల్లి సత్యనారాయణ

Children in tribal welfare school

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాన్ని గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో 9.08 శాతం గిరిజన జనాభాతో తెలంగాణ ఒక్కటే గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది. 2011 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 350.05 లక్షల జనాభా ఉండగా అందులో 31.78 లక్షల జనాభా గిరిజనులది. వీరిలో 16.83 లక్షల మంది గిరిజనులు… అనగా 52.96 శాతం మంది అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నారు. గిరిజనులలో పురుషులు 59.93 శాతం అక్షరాస్యులు కాగా, స్త్రీలలో 39.54 శాతం మంది అక్షరాస్యులు.

గిరిజనులు ప్రధానంగా గోదావరి, కృష్ణ నదీ పరీవాహకపు తొమ్మిది జిల్లాల్లోని 85 మండలాల్లో 1181 గ్రామాలలో (3765)ఆవాసాల్లో నివసిస్తున్నారు. వీటిల్లో 1738 ఆవాసాలను ఇటీవలి సంవత్సరాలలో గ్రామసభలుగా గుర్తించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 32 తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నప్పటికీ కింద పేర్కొన్న 10 తెగలు మాత్రమే ఈ రాష్ట్రంలో తరతరాలుగా నివసిస్తున్న స్థానిక గిరిజనులు.

పైన పేర్కొన్న గిరిజనులలో లంబాడీలు, ఎరుకలు రాష్ట్రమంతటా మైదాన ప్రాంతాలలో (కూడా) నివసిస్తున్నారు. చెంచులు కృష్ణానదీ పరివాహక నల్లమల అడవులలో (దక్షిణ తెలంగాణాలో) నివసిస్తున్నారు. మిగతా తెగలకు చెందిన గిరిజనులందరూ గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో ఉత్తర తెలంగాణలో నివసిస్తున్నారు.

తెలంగాణ గిరిజనులలో ఆంధ్‌ పర్ధాన్‌ తెగలు మరాఠీ మాతృభాషగా మాట్లాడగా, గోండులు, తోటీలు, గోండి, కోలాములు కోలామ, కోయల్లో ఒక పది శాతం మంది కోయ భాషను, మిగతా తొంభై శాతం మంది తెలుగును మాట్లాడుతారు. కొండరెడ్లు, నాయక్‌పోడ్‌లు, చెంచులు తెలుగు మాట్లాడుతారు. లంబాడీలు లంబాడీ, ఎరుకలు ఎరుకల భాషను మాతృభాషగా మాట్లాడుతారు.

ఇలాంటి వైవిధ్యభరితమైన గిరిజనుల సంక్షేమానికై తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచే అనేక చర్యలు చేపట్టింది. 2017లో తెలంగాణ గిరిజనుల సమగ్రాభివృద్ధి షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి’ చట్టాన్ని చేసింది. ఏ కారణంగానైనా ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే ఇతర సంక్షేమ పద్దులలాగా కాకుండా గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులు తదుపరి ఆర్థిక సంవత్సరానికి మళ్ళించబడటం ఈ చట్టం ప్రత్యేకత.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి’ చట్టం ప్రకారం గిరిజన సంక్షేమానికై రూ. 44,634.95 కోట్లు ఖర్చు చేశారు. అంటే గత ఎనిమిదేళ్ళలో తెలంగాణలోని ప్రతి గిరిజన కుటుంబానికి సుమారు రూ. 5.50 లక్షలు… అనగా ఒక్కో వ్యక్తికి రూ. 1.40 లక్షలు వెచ్చించారు.

ఈ షెడ్యూల్డ్‌ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి’’ ప్రకారం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సుమారు 21.23 శాతం నిధులు ఖర్చు చేయగా వ్యవసాయం, గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి, ఇంధన శక్తి తదితర 27 శాఖల ద్వారా మిగతా 78.77 శాతం నిధులు ఖర్చు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ కింద తెలిపిన విధంగా ఐదు రకాలుగా గిరిజన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.

  • విద్య 39.54 శాతం
  • మౌలిక సదుపాయాలు 27.6 శాతం
  • ఆర్థిక స్వావలంబన 17-33 శాతం
  • ఆరోగ్యం , సంస్కృతి  51 శాతం
  •  కేంద్ర పథకాలు 3.96 శాతం
Tribal arts and crafts

విద్య

గిరిజన సంక్షేమ కార్యక్రమాల్లో సింహభాగాన్ని (సుమారు 40 శాతం) గిరిజన బాల బాలికల విద్యకై ఖర్చు చేస్తారు. వారికి ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్య, వసతులు కల్పించడానికై ఈ కింది పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి.

పై పట్టికలో తెలిపిన విధంగా గిరిజన బాలబాలికలు 1432 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 27960 మంది చదువుతుండగా, గిరిజన సంక్షేమ శాఖ నడుపుతున్న 783 పాఠశాలలు, వసతి గృహాలలో 201382 మంది చదువుతున్నారు. మొత్తం 2,29,342 మంది గిరిజన బాలబాలికలకు ఉచిత విద్యనందించడం జరుగుతున్నది.

సెకండరీ విద్యను ప్రోత్సహిస్తూ గత ఎనిమిదేళ్ళలో గిరిజన విద్యార్థినీ విద్యార్థులు 2.50 లక్షల మందికి ప్రి-మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కింద రూ. 154.62 కోట్లు, 11.50 లక్షల మందికి పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కింద రూ. 1824.32 కోట్లు, 291 మందికి అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి కింద రూ.37.02 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది.

‘నాణ్యమైన విద్య మరియు అదనపు సౌకర్యాలు’ పథకం కింద గిరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం ఇప్పటివరకు ఉపగ్రహ ప్రసారం ద్వారా విద్య గరపడానికి 326 ఈ-పాఠశాలలను, 271 కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. 2017-18 సంవత్సరంలో పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లా పరిథిలోని 55 ఆశ్రమ పాఠశాలలు, 2019-20 సంవత్సరంలో 263 ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థులకు 3 నుంచి 9 తరగతులకు చెందినవారికి కరడిపథ్‌ మ్యాజిక్‌ ఇంగ్లిష్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను గరపడమైంది. ఈ విద్యా సంవత్సరం (2022-23)లో అన్ని గిరిజన సంక్షేమ జీపీ పాఠశాలలు/ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చుతున్నారు. వరంగల్‌ జిల్లా అశోక్‌ నగర్లో ఉన్న రెసిడెన్సియల్‌ పాఠశాలను సైనిక పాఠశాలగా అభివృద్ధి చేయడమైంది.

-మొత్తమ్మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ప్రాంతంలో 91 గిరిజన విద్యా సంస్థలుండగా వాటిల్లో 22ని డిగ్రీ కళాశాలలుగా, 16ను ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలలుగా అభివృద్ధి చేయడమైంది. తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ కింద గిరిజన విద్యార్థినిలకు 61, విద్యార్థులకు 99. కో-ఎడ్యుకేషన్‌ 23 కలిపి మొత్తంగా 183 విద్యా సంస్థలు స్థాపించి నడిపిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో చదివిన తెలంగాణ గిరిజన విద్యారినీ విద్యార్థులు, ఐఐటి., ఐఐఐటి, ఎన్‌.ఐ.టి., ఇంజనీరింగ్‌, మెడికల్‌ కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించారు.

మౌలిక సదుపాయాలు

తెలంగాణ ప్రభుత్వం ఈ కింది పేర్కొన్న మౌలిక సదుపాయా లను గిరిజన తండాలు, గూడేలు, పెంటలలో కల్పిస్తున్నది.

1. బి.టి. రోడ్లు 2. విద్యుత్తు 3. విద్యాలయాలకు అదనపు సౌకర్యాలు 4. ఆరోగ్య ఉప కేంద్రాలు 5. గిరిజన భవనాలు

తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1682 గిరిజన ఆవాసాలకు బి.టి. రోడ్లు ఏర్పాటు చేయడమైంది. మిగిలిన గిరిజన ఆవాసాలన్నింటికి బి. టి. రోడ్లు ఏర్పాటు చేయడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23) రూ. వేయి కోట్లు కేటాయించారు. తద్వారా మరో 2053 గిరిజన ఆవాసాలలో 3819 కి. మీ. రోడ్లు నిర్మాణమయి మొత్తంగా 10.89 లక్షల మంది గిరిజనులకు మంచి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం అన్ని గిరిజన ఆవాసాలకు 3-ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 3467 గిరిజన తండాలలో పనులు చేపట్టినా 2.44 లక్షల ఎకరాలకు విద్యుత్తును అందించగా ఈ ఆర్థిక సంవత్సరం (2022-23). ముఖ్యమంత్రి ‘గిరి వికాసం’ పథకం కింద మరో 1.95 లక్షల ఎకరాల భూమికి 3-ఫేజ్‌ విద్యుత్తును సరఫరా చేయాలని సంకల్పించారు.

గిరిజన విద్యార్థినీ విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకోవడానికి వీలుగా ఇప్పటి వరకు 514 గిరిజన విద్యాలయాలలో, వసతి గృహాలు, టాయిలెట్‌ బాకులు, ప్రహరీ గోడలు తదితర అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

2017-18 సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 193 ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2020-21 సంవత్సరంలో మరో 133…

tribal youth purchased car under self employment scheme

మొత్తంగా 326 ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పనులను వి.టి.డి.ఏ.లు (విలేజ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలు) చేపట్టాయి.

పూర్వపు జిల్లా కేంద్రాలు, ఐ.టీ.డి.ఏ (సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలు)లలో గిరిజనుల కోసం ఇప్పటి వరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 33 గిరిజన భవనాల నిర్మాణాలను మంజూరు చేయగా పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. హైదరాబాదులో లంబాడీల కోసం ఉట్‌ సేవాలాల్‌ బంజారా భవన్‌, ఇతర గిరిజనుల కోసం కుమ్రం భీమ్‌ ఆదివాసి భవన్‌ లను నిర్మించారు. ఆర్థిక స్వావలంబన

తెలంగాణ గిరిజనులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడానికి ప్రభుత్వం ఈ కింది విధాలుగా కృషి చేస్తున్నది.

1. జీవన భృతి పథకాలు 2. నైపుణ్య శిక్షణ 3. పారిశ్రామికులకు సహాయం 4. రవాణా రంగ సహాయం

వ్యవసాయం, పశుపోషణ, చేపల పట్టుట, ఉద్యానవన సాగు వంటి రంగాలలో గిరిజనులకు జీవనాధారం కల్పించడానికి ఉదేశించిన ‘‘ఆర్థిక సహకార పథకం’’ (ఇ.ఎస్‌.ఎస్‌.) కింద గత ఎనిమిదేళ్లలో -19220 మందికి 422.66 కోట్లు సహాయమందించారు. ముఖ్యమంత్రి

‘గిరి వికాసం’ పథకాన్ని 2018-19లో ప్రారంభించి గత మూడేండ్లలో రూ.55.99 కోట్లు విడుదల చేశారు.

గిరిజన యువతకు అవసరమైన శిక్షణ నైపుణ్యాలను అందించ. డానికి యువ శిక్షగా కేంద్రాలను (వై.టి.సి.), ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. స్వ నిర్మాణ సంబంధ పనులలో ఉపాధిని పెంపొందించడాని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనెక్షన్‌, హైదరాబాద్‌ వారితో, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించి, డానికి నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం (హాస్పిటాలిటీ మ్యానే జ్మెంట్‌, హైదరాబాద్‌వారితో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని గిరిజన యువతకు అవసరమైన శిక్షణా నైపుణ్యాలను అందిస్తున్నారు. 2014-15 నుంచి 2021-22 వరకు 31896 మంది గిరిజన యువత లబ్ది పొందారు. పి.ఇ.టి.సి.ల ద్వారా మరో 2999 మంది శిక్షణ పొందారు. ప్రస్తుతం ఉద్యోగాలకు పోటీ పడుతున్న వేలాది మంది గిరిజన యువతకు కోచింగ్‌ ఇస్తున్నారు.

సీఎం ఎస్టీ ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ – ఇన్నోవేషన్‌ స్కీమ్‌ కింద గిరిజన యువతకు 2018 – 19 నుంచి 2021-22 మధ్య 15ం మందికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, హైదరాబాద్‌లో శిక్షణ నిచ్చారు. 42 మీడియం, స్మాల్‌ Ê మార్జినల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (ఎమ్‌.ఎస్‌.ఎమ్‌.ఇ.) యూనిట్లు ఏర్పాటుకై 2019-22 మధ్య రూ.7.39 కోట్లు ఖర్చు చేశారు. 60 ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌కు రూ. 14.86 కోట్లు ఖర్చు చేశారు.

డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కింద గిరిజన యువకులు కారు కొనుక్కొని ఊబర్‌ ద్వారా లబ్బి పొందడానికి 2018-19 సంవతరంలో 441 మందికి రూ. 19.56 కోట్లు విడుదల చేశారు. గూడ్స్‌ వాహనాలు కొనుక్కొని గ్రామాలలో కిరాయికి నడుపుకోవడానికి వీలుగా 2016-17 లో 1043 మందికి రూ. 30-04 కోట్లు సహాయం చేశారు.

గిరిజన యువతుల పెండ్లి చేయడానికి ‘కళ్యాణ లక్ష్మి పథకం కింద గత ఎనిమిదేళ్ళలలో 1,31,127 కుటుంబాలకు రూ. 1073.89 కోటు విడుదల చేయడమైంది. 2018 వానాకాలం సీజన్‌ నుంచి గిరిజన రైతులందరికి, అటవీ హక్కుల చట్టం’ ప్రకారం హక్కులున్న వారందరికే రైతుబంధు’ పథకాన్ని వర్తింపజేసి 2021 యాసంగి వరకు 9 లక్షల 30 వేల మందికి పట్టాదారు రైతులకు 6389.47 కోట్లు విడుదల చేశారు.