|

పీవీ మన ఠీవీ

దేశానికి చేసిన సేవ తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీ. వీ. నరసింహా రావు ఎంతో ఉన్నతమైనది. ప్రధానిగా భారతదేశ ఖ్యాతిని జగద్విదిథం చేయడంలో పీ. వీ చేపట్టిన విధానాలు, సంస్కరణలు సాటిలేనివి. నేటి తరానికి ఆయన సేవలు గుర్తుండే విధంగా శ్రీ పీ. వీ నరసింహా రావు గారి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం దేశ, విదేశాలలో ఘనంగా నిర్వహించింది. హుస్సేన్ సాగర్ తీరంలో పీ. వీ గారి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు, ఆ రహదారికి “పీ. వీ. మార్గ్” గా నామకరణం చేసింది. పీ. వీ. నరసింహా రావు గారికి భారతరత్న ప్రకటించాలని శాశన సభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపింది.