రంజాన్‌ నజరానా!

రంజాన్‌-నజరానా!మన రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నివాని, పూర్వకాంలో వర్ధిల్లిన గంగాజమునా తహెజీబ్‌ను పునరుద్ధ్దరిద్దామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. జూలై 12న నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్‌ (ఇఫ్తార్‌ విందు)కు హాజరైన సి.ఎం. ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. రంజాన్‌ సందర్భంగా  నజరానాలు ప్రకటించారు. ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఒకనాడు ప్రపంచంలో మతసామరస్యానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.

గంగాజమునా సంప్రదాయానికి ప్రతీకగా మనల్ని దేశప్రజలు కొనియాడారన్నారు. 1927లో జాతిపిత మహాత్మాగాంధీ హైదరాబాద్‌ సందర్శించినపుడు వివేకవర్దని కళాశాలో ప్రసంగిస్తూ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయని ప్రశంసించారని పేర్కొన్నారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటూ సమైక్య భావనతో మెలగడంలో తెలంగాణాను మించిన ప్రదేశం మరొకటి లేదని కొనియాడారన్నారు. ఇక్కడి గంగాజమునా తహెజీబ్‌ చూసి ఉత్తర భారత ప్రజల ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని వ్యాఖ్యానించారని సి.ఎం. తెలిపారు. గాంధీ ప్రశంసలను అందుకున్న ఈ ప్రాంతంలో మళ్ళీ పాత సువాసను వెదజల్లాయన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 2న ప్రకటించిన విధంగా లక్షా 95 వేల మంది నిరుపేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 195 మసీదులో ప్రభుత్వం పక్షాన ఇఫ్తార్‌ విందు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఇమామ్‌కు, మౌజమ్‌కు నెలకు రూ.1000 జీవన భృతి కల్పించడం జరిగిందని తెలిపారు.మన పూర్వ సంప్రదాయాల, సంస్కృతి కాపాడుకునే దిశగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు సహాయ సహయకారాలు, అల్లా దయతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ‘‘నేను తెలంగాణ భూమి పుత్రుడిని, మీ బిడ్డగా మిమ్మల్ని కోరుకుంటున్నాను (మై వతన్‌ కా బేటా హు, ఆప్‌కా బేటా హు) రాష్ట్రా అభివృద్ధిలో అందరూ భాగస్వాము కావాలి’’ అని కోరారు. అభివృద్ధిలో రాష్ట్రం పురోగమిస్తున్నదని, అయినా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కొందరు మన అభివృద్ధికి అడ్డుతగుతున్నారని అంటూ, ఎందరు అడ్డుతగిలినా మనం ముందుకే వెళతామన్నారు. భగవంతుడి అనుగ్రహం మనకు నిండుగా ఉన్నన్ని రోజులు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని భరోసా వ్యక్తం చేశారు. ‘ముద్దయి లాఖ్‌ బురా చాహేతో క్యాహోగా`జో హోగా మంజూరే ఖుదా హోగా’ అంటూ ఉర్దూ సూక్తిని ఉటంకించారు. ఈ సంవత్సర కాంలో ప్రభుత్వ పరంగా ఎన్ని చేసినా తక్కువేనని, ముందుముందు ఇంకా ఎన్నో మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. అయితే విద్యుత్‌ విషయంలో ఎంతో సాధించామన్నారు. త్వరలో మన రాష్ట్రం మిగులు విద్యుత్‌తో ఉంటుందని, విద్యుత్‌ కోతలు ఉండవన్నారు.

సాగునీటి విషయంలో సమైక్య రాష్ట్రంలో అన్యాయానికి గురయ్యామని, ఆ సమస్య ఇంకా కొనసాగుతోందని సీఎం అన్నారు. ఈ సమస్యను కూడా త్వరలో అధిగమిస్తామన్నారు. రైతులకోసం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని, రైతులకు వ్యవసాయం లాభసాటిగా చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పేదలకు బట్టలు పంపిణీ చేశారు. జామే నిజామియా ఇస్లామిక్‌ విశ్వవిద్యాయం వైస్‌ ఛాన్సర్‌ మౌలానా ముఫ్తీ ఖలీల్‌ అహ్మద్‌కు ఖర్జూర పండ్లు అందించి ఇఫ్తార్‌ చేయించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎం.పి. కె.కేశవరావు, అస దుద్దీన్‌ ఒవైసీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మతో పాటు పువురు ముస్లిం మత పెద్దలు, ఎం.పి.లు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబరు 10లోని జహీరానగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి ముస్లిం సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. షాదీ ముబారక్‌ పథకంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కెటాయింపు జరిపామన్నారు.

ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్‌ విందు

జులై 12వ తేదీన రాష్ట్రంలోని 195 మసీదులో ప్రభుత్వ పక్షాన ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.పి.లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. జులై 15, 16 తేదీలో మొత్తం లక్షా 95వేల నిరుపేద ముస్లిం కుటుంబాలకు, కుటుంబానికి రూ. 500 విలువచేసే దుస్తులను రంజాన్‌ బహుమతిగా అందచేశారు.

గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ సందర్భంగా గవర్నర్‌ నరసింహ్మాన్‌ రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఉప ముఖ్య మంత్రి మహమూద్‌అలీ, ఏసీబీ చీఫ్‌ ఎ.కె.ఖాన్‌ తదితరులు హాజరయ్యారు.

రంజాన్‌ రోజు డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి

రంజాన్‌ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఇంటికి సతీసమేతంగా వెళ్ళారు. డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులకు సీఎం పండగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు హాజరయ్యారు.