|

అన్నదాతకు అండగా..

farming తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం ప్రజలు, వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, కొత్తగా సాగునీటి వ్యవస్థలు కల్పించకపోవడం, వర్షాభావ పరిస్థితులు, తదితర కారణాలవల్ల వ్యవసాయం చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితులలో రైతన్నకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అనేక చర్యలు చేపట్టింది. వ్యవసాయరంగానికి తొలి బడ్జెట్‌లో రూ. 8,511 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో ప్రణాళికా వ్యయం 3,061 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర వ్యయం రూ. 5,449 కోట్లు.

  • శ్రీ రైతుల పంటరుణాలు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ, రైతుల కడగండ్లకు చలించిన ముఖ్యమంత్రి బంగారం గిర్వి పెట్టి తీసుకొన్న పంట రుణాలను కూడా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మొదటి విడతగా రూ. 4,250 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారు. మిగతా విడతలను రాగల మూడేళ్లలో ఇలాగే చెల్లిస్తారు.
  • 2009`10 సంవత్సరం నుండి వరుసగా ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ రైతులను ఆదుకోవడానికి 480.43 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. అలాగే, ఎర్రజొన్న రైతులకు చెల్లించవలసిన బకాయిలు 11.50 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం చెల్లించింది.
  • రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ‘మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయతలపెట్టింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 400 కోట్లు ప్రతి పాదించారు.
  • శ్రీ తెలంగాణలో అనేక రకాల నేలలు ఉన్నాయి. సారవంత మైన భూములున్నాయి. ఇవన్నీ విత్తనాల తయారీకి అనుకూలమైనవి. మంచి ప్రణాళికతో తెలంగాణను భారతదేశ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.