ఊర చెరువు

గుండె చెరువయ్యే చెరువు కథ

గుండె చెరువయ్యే చెరువు కథ

ఊరికి చెరువే గుండెకాయ కదా, గుండె చెరువయ్యే చెరువు కథ ఎంతచెప్పినా వొడువని నేలతండ్లాట కథేకదా. అందుకే చెరువు కథ చెప్పడానికి ఉపక్రమిస్తే అది కావ్యంకాక మరేమవుతుంది? చెరువు ఒక దీర్ఘానుభవ సమాహారం.