ఎర్రగాలు

ముర్రి (రి) పాలు తీపితో ‘ఎర్రగాలు’ కవిత్వం

ముర్రి (రి) పాలు తీపితో ‘ఎర్రగాలు’ కవిత్వం

పదేండ్ల క్రితమొచ్చిన ‘మేలుకొలుపు’తో కవిగా పరిచయమైన కూకట్ల తిరుపతి రాసిన ఐదు పుస్తకాలలో యీ ‘ఎర్రగాలు’ కవిత్వం యెంతో మందిని మెప్పించింది. ఉత్తినే కవిత్వం రాయకుండా వున్న విషయాన్నే దృశ్యమానంగా చెప్పడంలో తిరుపతి గట్టి కృషినే చేస్తుంటాడ నిపిస్తుంది.