కడుపునిండా మాట్లాడుకొందాం
తెలుగు భాషలోని ”కడుపు” అనే పదానికి జఠరము, ఉదరము, పొట్ట, కుక్షి మొదలైన మాటలు పర్యాయంగా వచ్చే పదాలు. అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కడుపు అనే మాటకు నానార్థాలు కూడా ఉన్నాయి. అవి: గుండె, మనస్సు, పొట్ట, గర్భం అనేవి. ఎదుటివాళ్ళ బాధల్ని చూసి తెలంగాణలో కొందరికి ”కడుపు పగిలిపోతుంది”. ఇక్కడ కడుపు పగలడం అంటే గుండె వ్రయ్యలు కావడం.