సమవీక్షణ వీక్షణం
బడికి వెళ్ళే పసిప్రాయంలోనే ‘భావమంజరి’ అనే పద్యకృతి, మూడు పదుల వయసులోనే ‘చేదబావి’ కవితా సంపుటి, స్నేహితులతో కలిసి ‘ఆచూకీ’, మొన్న మొన్నటి వేర్పాటు తెలంగాణా ఉద్యమంలో ‘తండ్లాట’ వెలువరించి, అటు పండిత ప్రకాండులు, ఇటు సామాన్య ప్రజ అభిమానం చూరగొన్న కవి, కథకులు డా॥ కాంచనపల్లి గోవర్ధన రాజు.