చిత్రకారులకు నిర్దిష్ట దృక్పథం అవసరం
పల్లెపట్టులలోని స్త్రీపురుషుల నిత్యజీవితం, సుఖదు:ఖాలు, కోపతాపాలు, అందులోని శృంగారం కె. లక్ష్మాగౌడ్ చిత్రాలలోని వస్తువు. ఇలా సరికొత్త కోణంనుంచి భారతీయ సంస్కృతిని తన చిత్రాలలో ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారుడు కె. లక్ష్మాగౌడ్ ఎప్పటికప్పుడు వివిధ చిత్రకళా ప్రక్రియలు చేపట్టి తనకొక విశిష్టస్థానాన్ని పదిలం చేసుకున్న నిత్యనూతన చిత్రకారుడు కూడా.