కోడి కూతకు ముందే తెల్లవారుజాము

కోడికూతతో ఎగిలివారుతది

కోడికూతతో ఎగిలివారుతది

పెద్ద ఎగిలివారంగనే అందరికీ మేల్కువ వస్తది. కని మేల్కొలిపేతందుకు బుడు బుడ్కలాయన ఒక పాట పాడుకుంట ఇంటికి వస్తడు. చిడ్లుం బిడ్లుం అనే గమ్మతిగ సప్పుడు చేసికుంట వస్తడు. అదొక గమ్మత్తైన సప్పుడు. ఆ కాలంలో వాకిలి అవుతల గేట్లు ఉండేవి కావు.