లకారం చెరువులో లాహిరి.. లాహిరి..
ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.