చెట్లు పిట్టలు గుట్టలు… సూస్తేనే కండ్ల సంబురం
పచ్చని ప్రకృతిని సూస్తే ఎవలకైనా కండ్ల పండుగ. పచ్చని చెట్లు ఊరి సుట్టు గుట్టలు, చెల్కలు, కంచెలు, వాగులు, చెర్లు, నదులు తీరొక్క పిట్టలను సూస్తే కడుపు నిండినట్టే అయితది. భూమి, గాలి, నీళ్ళు, మొగులు ఇవన్ని మనిషి పుట్టక ముందు పుట్టినయి. సకల జంతు జాలాలు ప్రకృతిలో మెదులుతాయి.