రాష్ట్రంలో అద్భుత ప్రగతి… కలెక్టరేట్ల ప్రారంభ సభలో సీఎం కేసీఆర్
జనగామ, యాదాద్రి`భువనగిరి జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మనం నిర్మించుకున్న కలెక్టర్ కార్యాలయాల మాదిరిగా కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా లేవని అన్నారు. కలెక్టరేట్లు దేవాలయాల వంటివని, వీటిని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.