ఆయన శపిస్తే మంత్రి పదవి పోయింది!
గాంధీజీ సాధుపుంగవుడు, ప్రేమమూర్తి. అమృత హృదయుడు. ఆయన అనుంగు శిష్యుడు ఆచార్య కృపలానీ చిరాకు, చికాకు, కనుబొమ్మలు చిందుతొక్కడానికి తీక్షణమైన చూపులు. వీరిద్దరికీ పొత్తు ఎలా కుదిరిందనుకునేవారు ఆ రోజుల్లో.
గాంధీజీ సాధుపుంగవుడు, ప్రేమమూర్తి. అమృత హృదయుడు. ఆయన అనుంగు శిష్యుడు ఆచార్య కృపలానీ చిరాకు, చికాకు, కనుబొమ్మలు చిందుతొక్కడానికి తీక్షణమైన చూపులు. వీరిద్దరికీ పొత్తు ఎలా కుదిరిందనుకునేవారు ఆ రోజుల్లో.
కత్తినీ కలాన్నీ సరిసమానంగా ప్రయోగించగల కృష్ణరాయ, భోజరాజాదులను మనం చూడలేదు. కాని అట్టి సవ్యసాచిత్వంగల బూర్గుల రామకృష్ణరావుగారిని చూశాం. అతి జఠిలమైన రాజకీయ సమస్యా పరిష్కారంలో నిమగ్నమై ఉంటూనే క్షణం విశ్రాంతి దొరికితే చాలు సాహిత్య వ్యాసంగంలో పడిపోయేవారు.
‘‘తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర’’ శీర్షికన ఒక లఘుగ్రంథాన్ని రచించారు. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తాజాగా ఆయన ‘‘తెలంగాణ చరిత్ర’’ గ్రంథాన్ని వ్రాశారు.