జీరో డిగ్రీ కవితలు

జీవితాలను రంగరించిన  జీరో డిగ్రీ

జీవితాలను రంగరించిన జీరో డిగ్రీ

ఈ మధ్యనే వచ్చిన వీరి ‘జీరో డిగ్రీ’ కవిత్వం చదివినప్పుడు కవిత్వానికి రంగూ, రుచి, వాసన గూడా వుంటుందా అనిపించింది. కవిత్వంలో జిగిబిగి గురించి చెప్పడం కాదుగానీ వీరికి కవిత్వంమీద మాత్రం మంచి పట్టుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
‘అమ్మ ముఖంమీది ముడుతలు తను పడ్డ కష్టాలకు ప్రతీకలు
పాదాల పగుళ్లు రొటీన్‌ బతుకుమీద రోతకు ఆనవాళ్లు’ ` అని చెప్తాడొకచోట.