శిల్పానికి ప్రతిబింబాలు ‘అపురూపం’ కథలు
ఒక రచనకు వస్తువు, వర్ణనలు, పాత్రలు ఎలాంటి సొబగును చేకూర్చుతాయో ‘శైలి’ కూడా అంతే శోభను చేకూర్చుతుంది. శైలి అనే మాటకు పనితనం, నైపుణ్యం, అందం, చమత్కారం, పద్ధతి అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఏ రచనలోనైనా రచయిత లేదా రచయిత్రి ఏం చెప్పారు? ఎలా చెప్పారు? అని పాఠకుడు ఆలోచించడం సహజం.