డా॥ శ్రీ రంగాచారి

రసార్ణవ సుధాకరం

రసార్ణవ సుధాకరం

ఇది రసార్ణవ సుధాకరము. సర్వజ్ఞ సింగభూపాలుని రచన. డా॥ శ్రీరంగాచార్యుల సంపాదకత్వంలో తెలంగాణా సాహిత్య అకాడెమీ వారి పద్దెనిమిదవ ప్రచురణగా వెలుగులోకి వచ్చింది. రాచకొండను 1425-75 మధ్య అయిదు దశాబ్దాల కాలం పరిపాలించిన సర్వఙ్ఞ సింగభూపాలుడు పద్మనాయక ప్రభువులందరిలో మిక్కిలి కీర్తి పొందినవాడు.