తెలంగాణ ప్రాచీన వారసత్వం వివరించే గ్రంథం
ప్రాచీన భారతదేశానికి లిఖిత చరిత్ర లేదు. ఆనాటి నాణాలు, నిర్మాణాలు, వస్తు సామగ్రి ఆధారంగా చరిత్రను సమన్వయపరుచుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ చరిత్ర కూడా ఇట్టి నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, మట్టి పాత్రలు, పూసలు ఆధారంగా నిర్మించుకోవాల్సిందే