మంచిని పెంచే ‘మానవీయ ఉపాధ్యాయుడు’
మనిషి ఎటువైపు పయనిస్తున్నాడు? మానవీయ విలువలు నేర్పని విద్య దేనికోసం? పౌరున్ని పౌరునిగా నిలబెట్టలేని ఆధునిక సాంకేతిక ప్రగతి ఎందుకు? సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అనే ధర్మ బద్ధమైన ప్రశ్నలతో ధర్మాగ్రహాన్ని, ఆవేదననీ ప్రతి ఫలిస్తుందీ ‘మానవీయ ఉపాధ్యాయుడు’ పుస్తకం.