తెలంగాణ అభ్యుదయ కవి గులాం యాసీన్
కవి గులాం యాసీన్ స్వగ్రామం కల్వకుర్తి. యాసీన్ ఆరడుగుల అందగాడు. తెల్లని లాల్చీ, పైజామా వేషధారణతో హమేషా హసన్ముఖంతో అందరినీ పలుకరించడం ఆయన మూర్తి మత్వం! తాను హైదరాబాద్ ప్రభుత్వోన్నత పాఠశాలలో తెలుగును బోధిస్తే భార్య ఫర్హద్ సుల్తానా హిందీ బోధించేది.