తెలంగాణ కవి

‘ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల’

‘ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల’

ఏ ప్రపంచమ్మైన ఈ కవి

తాప్రపంచము బోలనేరదు,

రాతిగుండెలపైననైనా

రాజ్యమేలునురా కవిత్వము!-అంటూ కవిత్వ విశిష్టత, ఔన్నత్యాలపై సాధికారిక ఫర్మానా జారీ చేశారు కవి ముకురాల రామారెడ్డి.

పరబ్రహ్మ!  పరమేశ్వర!!  గీతకర్త

పరబ్రహ్మ! పరమేశ్వర!! గీతకర్త

లక్షణమైన సంస్కృతి విలువలను పరిరక్షించడానికి మన భారతదేశంలో జన్మించిన మహానుభావులలో కవులు, కళాకారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించి, పరోపకారం, త్యాగం వంటి ఆదర్శ లక్షణాలతో మానవత్వపు విలువలకు కొత్త ఊపిరి పోశారు. అలాంటివారిలో ‘తెలంగాణా మునీశ్వరుడు’ అనదగిన ప్రసిద్ధ కళానుశీలి, అపూర్వ ప్రతిభాశాలి ‘చందాలకేశవదాసు’.