పెద్దంత్రం చిన్నంత్రంలేని మాటలు
తెలంగాణలో ప్రజల భాష వుంది. దేశి సాహితీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాషా వ్యవహారం ఇక్కడి పల్లీయులలో వున్నది. శిష్టులకన్నా, పండితులకన్నా, విద్యావంతు లకన్నా భిన్నమైన, సహజమైన, సరళమైన, స్పష్టమైన పలుకుబడి తెలంగాణలో వున్నది.