కైత్కాల కనకచందం.. కట్టపొంటి ముచ్చట్లు
మంది అందరు పురాగ అడివైయిండ్రు. లావు శానత్తం మాట్లాడవట్టిండ్రు. ల్యాకపోతే ఏంది మరి. గా ఆన్వెకాయ అంటె తెల్వదా! అన్వెకాయను సోరకాయ అనవడ్తిరి. గంపల కూరగాయలు అమ్ముకునే ఎంకటవ్వసుత సోరకాయలు అంటాంటె నాకు ఎక్కన్నో కాలుకస్తంది. ఎన్కటి తాతల కాలం నుంచి మనమాట మన ముచ్చట మరుస్తండ్రు.