తెలంగాణ భాష

మామా.. బావా.. బాపు.. అనురాగాల పిలుపు

మామా.. బావా.. బాపు.. అనురాగాల పిలుపు

పల్లెలంటే అనురాగాల ముల్లెలు. ఒగలంటే ఒగలకు పట్టింపు ఉంటది. ఆపతిల సంపతిల ఆదుకుంటరు. ఊరంత అట్లనే ఉంటది. ఒగలకు ఇంకొకలు ధీమ. అంటే కొట్లాటలు ఉండయా! అంటే అవి సూత అక్కడక్కడ ఉంటయి. మల్ల ఎంటనే కుదురుకుంటయి.

ఇంటికి సుట్టం వచ్చిండంటే  ఇల్లంత సంబురమే సంబురం

ఇంటికి సుట్టం వచ్చిండంటే ఇల్లంత సంబురమే సంబురం

ఇంటికి సుట్టపోల్లు వస్తుండ్రంటే ఇంటిల్లాదులకు సంబురం అన్పిస్తది. మా అవ్వగారోల్లు వస్తండ్రని అవ్వకు, మా మ్యానమామలు వస్తండ్రని పోరలకు, బామ్మర్ది వస్తండని బావకు, ఎవలకైనా సుట్టాలంటేఎదిరిసూసుడే. పొద్దుగాల లేశి బోల్లు కడుగుతాంటెనే కాకి ఒర్రుతనే

తోటి కోడలు అనుడేంది? యారాలు అనాలె.

తోటి కోడలు అనుడేంది? యారాలు అనాలె.

మనదికాని బాస మనది కాని యాస తోని పరేశాని ఉన్నది. యారాలు ఫోన్‌ చేసింది అనక మా తోటికోడలు అనవడ్తిరి. సడ్డకుడు ఎంత మంచిపేరు ఇది ఇడిశిపెట్టి తోడల్లుడు ఇదేందో అర్ధంగాదు.

పాఠ్యాంశా  నవోదయం

పాఠ్యాంశా నవోదయం

భాషా సాహిత్యాలు ఏ జాతికైనా ఆయువుపట్టు. తన భాషా, తన సాహిత్యంపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏ జాతికైనా భాష ప్రాణవా యువు. భాష అంటే మాట్లాడే పదాలు మాత్రమే కాదు. భాష ఒక జీవన విధానం.