తెలంగాణ వికాస సమితి

మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు

మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు

తెలంగాణ ప్రాంతం తన మూలాలను తడిమి చూసుకొంటున్న తరుణంలో లభించిన యోగమూర్తి మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు. ఈ పేరును యోగుల చరిత్రను అందించిన డా|| బి. రామ రాజు మొదట ప్రతిపాదించగా, తెలంగాణ తొలి దళితకవిగా సాహిత్య చరిత్రకారుడు డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్థిరం చేశారు.