తియ్యటి మాటలకు తీర్తం బోతే
సాహిత్యపరంగా తెలంగాణ ప్రాంతాన్ని చూసినప్పుడు తెలంగాణ సాహిత్యంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు గమనించవచ్చు. తెలంగాణ సాహిత్యం సంప్రదాయ సాహిత్య రీతులకు కొంత భిన్నంగా కనిపిస్తుంది. అంటే పండిత ప్రకాండులు వెలయించిన మార్గ సాహిత్యానికి సమాంతరంగా ఒక పాయ తెలంగాణలో ప్రవహిస్తున్నది.