తెలంగాణ అవతరణ అనంతరం సాహిత్య వికాసం
తెలంగాణ సాధించుకున్న తర్వాత సాహిత్యం కూడా కొత్త వెలుగును నింపుకుంది. అస్తిత్వాన్ని అన్వేషించుకుంది. స్థానాన్ని నిర్దేశించుకుంది. చిత్ర పరిశ్రమలో ఇంతకాలంగా తెలంగాణ భాషను వ్యంగ్యంగా చిత్రించిన దశనుండి ఆ భాష సొగసులను, సౌందర్యాన్ని, మాధుర్యాన్ని తెలిజేస్తూ వెండి తెరపై మెరుపులు ప్రదర్శించింది.