పానుగల్లులో ఆలయ సముదాయం!!
నల్గొండ జిల్లాలోని నేటి జిల్లా కేంద్రమైన నల్గొండ పట్టణానికి 2కి.మీ. దూరంలో జిల్లా కేంద్రంలో కలిసిపోయిన ప్రాచీన నగరం పానుగల్లు. ఇది కందూరు చోళులకు రాజధాని నగరం. ఇక్కడ అత్యంత అద్భుతమైన ఆలయ సంపద నేటికీ సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తుంది.