పల్లె ప్రగతితో మారిన గ్రామాల ముఖ చిత్రాలు
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనం, పల్లెప్రగతితో మారిన గ్రామాల ముఖచిత్రాలు. తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతోంది. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లతో పల్లెల్లో పరిశుభ్రత, హరితహారం అమలుతో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.