ప్రభుత్వం ఇచ్చిన భూమిలో బంగారు పంటలు
ఒకప్పుడు వారంతా దినసరి కూలీలు. రోజువారీ సంపాదనతో కాలం వెల్లదీసేవారు. ఇపుడు వారంతా మూడు ఎకరాల చొప్పున సాగు భూములకు యజమానులుగా మారారు. రైతులుగా మారి ఆ మూడు ఎకరాలలో రెండు పంటలు పండిరచడంతో వ్యవసాయం వారికి లాభదాయకంగా మారడమే కాకుండా స్వీయ సాధికారిత సాధించారు.