బ్రాహ్మణ వేదవిధ్యా పరిషత్

ఏనుగెక్కిన పాండిత్యం!

ఏనుగెక్కిన పాండిత్యం!

కొందరికి కొన్నికొన్ని శాస్త్రాలలో పాండిత్యం వుంటుంది. కొందరికి కవిత్వం, కళలు మొదలైన వాటిలో నైపుణ్యం వుంటుంది. మరికొందరికి లౌకిక కార్యకలాపాలలో వ్యవహార దక్షత వుంటుంది. కానీ, విభిన్న రంగాలలో సమర్థుడుగా ఓ వెలుగు వెలిగిన మహోన్నత వ్యక్తి శాస్త్రుల విశ్వనాథ శర్మ.