మా ప్రసిద్దిపేట

మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

ఊహించి రాసే కథలకన్నా వున్నదున్నట్టురాసే కలం చాల గొప్పది. చిన్నప్పటి విషయాలను యాది మీరకుండా బాగా గుర్తుంచుకొని తను పుట్టిపెరిగిన ఊరు పరిస్థితిని అప్పుడూ ఇప్పుడూ ఎలా వుందనే సంగతిని ఒక ప్రత్యేక శైలిలో రాసి ” మా ప్రసిద్ధిపేట పుస్తకంలో ” సిద్ధిపేట” గురించి ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు మూర్తిగారు.