వాన ముచ్చట్లు

వాన.. వాన.. ఇరుగదంచిన వాన..

వాన.. వాన.. ఇరుగదంచిన వాన..

మస్తువానలు వస్తే కుంటలు చెర్లు రోడ్లు తెగేకాడ తెగుతయి. కాలం వచ్చినప్పుడు గట్టిగ లేనికాడ తెగుతది. దాంతోని కొంత నష్టం ఉంటది. ఉండనియి కని, వాన మంచిదే రావాలె, పడాలె వానల్ల మనందరం తడవాలె. కొంత అక్కడక్కడ కొన్ని పంటలు మునిగిపోతయి కొన్ని పంటలు సుత ఖరాబు అయితయి.