విజయాలకు శ్రీకారం
మనిషిలో మేధాశక్తి అపారం, దాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం. లేదంటే అపజయం. విజయాన్నే ఓ కౌన్సిలర్‌గా మార్చి ‘విజయం ఆత్మకథ’ అని విజయంతోనే తనను తాను పరిచయం చేయించుకున్నాడు రచయిత. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులను దృష్టిలో వుంచుకుని పుస్తకాన్ని రచించినా, ఈ పుస్తకం విద్యార్థులందరికీ ఉపయోగకరంగా వుంటుంది.