కుంచెలో వైకుంఠం!
కుంచెతో చేసిన పనితనం, పోయిన పోకడలు ప్రశంసనీయమైనవి. ఎర్రని, పసుపుపచ్చని, ఆకుపచ్చని ప్రాథమిక వర్ణాలను తీసుకుని భావోద్వేగంతో ఆయన చిత్రించిన పల్లీయుల చిత్రాల మల్లెల వాసనలు కళాహృదయులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఒక్కొక్క చిత్రాన్ని నాలుగైదు రోజులపాటు విశ్రాంతిలేకుండా వేయగల సమర్థుడు వైకుంఠం.