ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కృష్ణారెడ్డి కళాగమనం
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, తెలుగుజాతి కళా ఖ్యాతి ప్రపంచ కీర్తి శిఖరంపై ఆవిష్కరించిన గొప్ప కళాకారుడు శిల్పి కృష్ణారెడ్డి. చిత్తూరు జిల్లా నందనూరు గ్రామంలో 1925లో జన్మించిన ఆయన పాఠశాల జీవితం గడుపుతుండగానే ఆయనలో కళాభిరుచి వికసించింది.