సర్వశిక్షా అభియాన్

మూత ‘బడి’ పోకుండా

మూత ‘బడి’ పోకుండా

అదొక రహదారి సౌకర్యం కూడా సరిగా లేని మారుమూల గిరిజన తాండ. మహబూబ్‌నగర్‌ జిల్లా, హన్వాడ మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తండా పేరు దొర్రి తాండ. ఈ తాండాలో 102 కుటుంబాలుండగా మొత్తం జనాభా 751. అయితే ఇందులో 70 శాతం గిరిజనులు వ్యవసాయ పనులు చేసేవారే.