స్వామి రామానంద తీర్థ

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

హౖదరాబాద్‌ రాష్ట్రం నాయకులలో చాలా మంది, వారెక్కడ పుట్టినా హైదరాబాద్‌ నగరాన్నే కార్యరంగంగా ఎంచుకున్నారు. రాజధాని నగరం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ తమ స్ఫూర్తినీ, ప్రేరణనూ జిల్లాలకు వ్యాపింపచేశారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఆనాటి నాయకత్వ స్థూల స్వరూపమిది. స్వామీ రామానంద తీర్థ కన్నడిగునిగా జన్మించినందువల్ల కర్నాటక ప్రాంత ప్రజలు ఆయనను తమ నాయకునిగా భావించే వారు.