బాలల చలన చిత్రోత్సవానికి సర్వ సన్నాహాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది.
19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా॥ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 18న హోటల్ టూరిజం ప్లాజాలో 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ నిర్వహణ కమిటి సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.