ప్రతీ ఇంటికీ సంక్షేమం.. ప్రతీ ముఖంలో సంతోషం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటగా అట్టడుగు వర్గాలకు, అసహాయులకు అన్నార్థులకు కనీస జీవన భద్రత కల్పించాలని, ఇది సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సంకల్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటగా అట్టడుగు వర్గాలకు, అసహాయులకు అన్నార్థులకు కనీస జీవన భద్రత కల్పించాలని, ఇది సామాజిక బాధ్యత అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సంకల్పించారు.
తగ్గిన వయోపరిమితి.. లబ్ధిదారుల్లో ఆనందం
ఆసరా పెన్షన్ల పెంపునకు సంబంధించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలుపుకున్నారు.
కొత్త రాష్ట్రంలో నిరుపేదల బతుకులు మారాలని, వారికి గృహ వసతితోసహా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు, కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ వర్గాలవారికి చెల్లిస్తున్న పెన్షన్లు నామమాత్రంగానే ఉన్నాయని, అవి వారి జీవితాలకు ఏ విధంగా చాలడంలేదన్న తలంపుతో ‘ఆసరా’ పథకాన్ని రూపొందించింది.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం కొండంత ‘ఆసరా’ ఇచ్చింది. వీరికి చెల్లించే పింఛను మొత్తాన్ని దాదాపు ఐదురెట్లు పెంచడంతోపాటు, ఈ పింఛన్ల పథకానికి ‘ఆసరా’ అని నామకరణం చేసింది.