వ్యవసాయం, అనుబంధరంగాలు
జనాభాలో సగంమందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయరంగాన్ని లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు, ప్రతికూల పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు తక్షణం ఉపశమనం కలిగించడానికి రైతుల బ్యాంకు రుణాల మాఫీకోసం ప్రభుత్వం రూ. 4,250 కోట్లు విడుదల చేసింది.