Amazon godown at Kothuru

కొత్తూరులో అమెజాన్‌ గోడౌన్‌ల నిర్మాణం

కొత్తూరులో అమెజాన్‌ గోడౌన్‌ల నిర్మాణం

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలంలో అంతర్జాతీయ ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ సంస్థ తమ గోడౌన్ల నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమక్షంలో అమెజాన్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షులు డేవ్‌ క్లార్క్‌, ఇండియా కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌లు ఏప్రిల్‌ 8న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.