చిన్నారుల రక్షణ కోసం బాలరక్షక్ వాహనాలు
కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్) నిధులతో బాలరక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.