Bathukamma festival

మెట్ల బావిలో పూల పండగ

మెట్ల బావిలో పూల పండగ

ప్రకృతిని,  పూలను దేవతగా  పూజించే సంస్కృతి మన తెలంగాణ ప్రజలకే సొంతం. అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటాము. అయితే ఈసారి నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి వినూత్నంగా ఆలోచించారు. జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా నారాయణపేటలోని భారం బావి వద్ద అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బతుకమ్మ సంబురాలను  ఘనంగా నిర్వహించారు. 

బతుకమ్మ బతుకమ్మ  ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఈ పండుగను అధికారికంగా జరుపుకోవడం విశేషం.