అన్నదాతకు అండగా..
సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికి అధిక నిధులు కేటాయించడం, తదితర కేటాయింపుల ద్వారా 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. రైతన్నను ఆదుకొనేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా , రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పంటల పెట్టుబడి పథకానికి రూ, 12,000 కోట్లు కేటాయించటం విశేషం.