బౌద్ధ వారసత్వవనం బుద్ధవనం
తెలంగాణా బౌద్ధ వారసత్వవనంగా బుద్ధవనం నిలువబోతోంది. బుద్ధుని జీవితకాలంలోనే తెలంగాణ నేలలో ప్రవేశించిన బౌద్ధం అంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు బౌద్ధ పరిమళాలతో పరిఢవిల్లిన నేలలో సుమారు ముప్పైకి పైగా చారిత్రక బౌద్ధ స్థలాలు నేటికీ నిలిచివున్నాయి.